సంక్రాంతి సినిమా సందడి... జనవరిలో విడుదలయ్యే సినిమాల వివరాలివి!

  • సందడి చేయనున్న పలు చిత్రాలు
  • అందరి కళ్లూ 'ఎన్టీఆర్', 'వినయ విధేయ రామ'పైనే
  • 'ఎఫ్2', 'పేట'పై కూడా
సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్ రాగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది సంక్రాంతి, కోడి పందాలు అయితే, ఆ వెంటనే గుర్తొచ్చేది కొత్త సినిమాల సందడి. ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలకు సిద్ధం అయ్యాయి. వాటిని ఓమారు పరిశీలిస్తే...

ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై తయారైన 'ఎన్టీఆర్' తొలిభాగం, 9వ తేదీన వెండి తెరను తాకనుంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు పలు పాత్రలను పోషించారు. ఆ వెంటనే 11వ తేదీన మెగా హీరో రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలకాగా, అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక జనవరి 12న విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ 'ఎఫ్2-సంక్రాంతి అల్లుళ్లు' విడుదల కానుంది. ఈ సినిమా నవ్వులు పూయిస్తుందనడంలో సందేహం లేదని ట్రైలర్ చెబుతోంది.

డబ్బింగ్ చిత్రాల్లో రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' 10వ తేదీన విడుదల కానున్నాయి. బాలీవుడ్ చిత్రాలను పరిశీలిస్తే, లక్షిత దాడుల నేపథ్యంలో తయారైన 'యూరి: ది సర్జికల్ స్ట్రయిక్స్' 11వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' కూడా అదే రోజు విడుదలవుతుంది. ఇక సంక్రాంతి తరువాత కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయిగా కనిపించే 'మణికర్ణిక', అఖిల్ హీరోగా తయారవుతున్న 'మిస్టర్ మజ్ఞు' జనవరి 25న విడుదల కానున్నాయి.
Go Back to Shorts
New Year
Tollywood
Movies
Sankranti
NTR
Peta
Vinaya Vidheya Rama

More Telugu News