ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్.. ఏపీ లాయర్ల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- హౌస్ మోషన్ పిటిషన్ వేసిన లాయర్లు
- విభజనకు మరికొంత సమయం కోసం విజ్ఞప్తి
- జనవరి 2న విచారణ చేపడతామన్న సుప్రీం
ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదనీ, జనవరి 2న ఇతర పిటిషన్లతో పాటు మామూలుగానే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఏపీ న్యాయవాదులు, జడ్జీలు అమరావతికి వెళ్లడానికి సిద్ధపడాలి.
దీంతో రేపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ న్యాయమూర్తుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.