చైతన్య-సమంత మూవీ అప్ డేట్.. మజిలీ ఫస్ట్ లుక్ విడుదల!

  • శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • రైల్వే క్లర్క్ గా కనిపించనున్న సమంత
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగచైతన్య
పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత తొలిసారి శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మజిలీ అనే టైటిల్ ను చిత్ర బృందం ఖరారు చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. ట్విట్టర్ లో నాగ చైతన్య మజిలీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.

ఈసందర్భంగా చైతన్య స్పందిస్తూ..‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. సమంతతో జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుద్దాం‘ అని ట్వీట్ చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్‌లో చై, సామ్‌ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. ఈ సినిమాలో చైతన్య మాజీ క్రికెటర్ గా, సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Tollywood
samantha
naga chaitanya
majili
movie
cinema news
first look
release
Twitter

More Telugu News