అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్.. తాను బదిలీ కావడంతో వాదనలు వినలేనన్న న్యాయమూర్తి!
- సీబీఐ కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత
- వాదనలు వినిపించేందుకు సిద్ధమైన జగన్ లాయర్
- తనను ఏపీ కోర్టుకు కేటాయించినందున వినలేనన్న న్యాయమూర్తి
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎం.వెంకటరమణ కల్పించుకుని న్యాయాధికారుల విభజనలో భాగంగా తనను ఏపీకి కేటాయించారని తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో తాను వాదనలు వినడం సరికాదని పేర్కొన్నారు. దాంతో కేసును జనవరి 4కు వాయిదా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య న్యాయాధికారులను కేటాయిస్తూ ఉమ్మడి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేయడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరొకరిని నియమించే అవకాశం ఉంది.