గర్భిణికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన కేసు... మనస్తాపంతో ఎలుకల మందు తిన్న రక్తదాత!
- తమిళనాడులో కలకలం రేపిన ఘటన
- బంధువు కోసం రక్తమిచ్చిన 19 ఏళ్ల యువకుడు
- ఎయిడ్స్ ఉందని తరువాత వెలుగులోకి
ఇటీవల ఆ యువకుడు విదేశాలకు వెళ్లే నిమిత్తం ఫిట్ నెస్ టెస్ట్ లో భాగంగా రక్త పరీక్షలు చేయించుకోవడంతో హెచ్ఐవీ ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే అతను బ్లడ్ బ్యాంకుకు వెళ్లి విషయాన్ని వివరించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన రక్తాన్ని ఓ గర్భిణికి ఎక్కించారని తెలిసింది. దీంతో తన వల్ల తన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని భావించిన సదరు యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతనికి రామనాథపురం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు.