'బాబాయ్, నాకో ఇల్లు ఇవ్వవా?' అని తేజ్ ప్రతాప్ అడగ్గానే తన పాత ఇల్లును అప్పగించిన నితీశ్ కుమార్!
- భార్యతో విడాకులు కోరుతున్న తేజ్ ప్రతాప్
- కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని కోరుకున్న లాలూ తనయుడు
- కొత్త ఇంటిని కేటాయించిన బీహార్ సర్కారు
తాను సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, అధికార నివాసంలోకి మారడానికి ముందు నివసించిన ఇంటిని కేటాయించారు. ఈ ఇల్లు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నివసించిన సర్క్యులర్ రోడ్ లోని 10వ నంబర్ బంగళాకు సమీపంలోనే ఉండటం గమనార్హం. కాగా, తేజ్ ప్రతాప్ కు ఇంటిని కేటాయించడంపై నితీశ్ స్పందిస్తూ, తేజ్ తన భార్యను తిరిగి కలుసుకునేందుకు, ఇద్దరూ ఒకటయ్యేందుకు ఈ ఇల్లు సహకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే తేజ్, ఐశ్వర్యల మధ్య విభేదాలు సమసిపోతాయని అనుకుంటున్నట్టు చెప్పారు.