వెంకన్నపై భక్తుల కాసుల వర్షం... గురువారం రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!
- రూ. 4.20 కోట్ల ఆదాయం
- తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
- సర్వదర్శనానికి 20 గంటల సమయం
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండాయి. సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు స్వామివారిని 72,882 మంది దర్శించుకోగా, 26,107 మంది తలనీలాలు సమర్పించారు.