మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత శపథం.. 15 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన వైనం!
- పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ చెప్పులు ధరించనని శపథం
- ఇటీవలే అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్
- సీఎం సమక్షంలో చెప్పులు ధరించిన దుర్గాలాల్
ఆ మాట పైనే 15 ఏళ్ల పాటు చెప్పుల్లేకుండా తిరిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆయన శపథానికి ముగింపు చెప్పి.. ముఖ్యమంత్రి కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో చెప్పులు ధరించారు. ఈ విషయం గురించి కమల్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు.