మోదీకి సీఎం హోదాలో చంద్రబాబు స్వాగతం పలకాలి: మాణిక్యాల రావు
- దేవాలయాల్లో అభివృద్ది కుంటుపడింది
- ఆలయ నిధులను పార్టీ ప్రచారాలకు ఉపయోగిస్తే... ఉద్యమిస్తాం
- కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించేది కేంద్ర ప్రభుత్వమే
ఈరోజు ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను రాజీనామా చేసిన తర్వాత... దేవాలయాల్లో అభివృద్ది కుంటుపడిందని చెప్పారు. దేవాలయాల నిధులను పార్టీ ప్రచారాలకు ఉపయోగిస్తే భక్తుల తరపున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించేది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.