నితిన్ తో చేసేందుకు రకుల్ రెడీ
- వెంకీ కుడుములతో నితిన్
- తదుపరి సినిమా చంద్రశేఖర్ యేలేటితో
- త్వరలోనే పూర్తి వివరాలు
ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటితోను ఒక సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది తాజా సమాచారం. చాలా కాలంగా రకుల్ తెలుగులో స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. కొత్త కథానాయికల పోటీ కారణంగా ఇటీవల ఆమె జోరు తగ్గింది. అవకాశాలు లేకపోవడం వల్లనే రకుల్ ఈ సినిమాను అంగీకరించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.