Mahesh Babu: మహేశ్ బాబు కోసం మరో కథ .. సుకుమార్ కి మళ్లీ నిరాశ?

  • 'మహర్షి'తో బిజీగా మహేశ్ 
  • ఏప్రిల్లో భారీ స్థాయి రిలీజ్ 
  • తదుపరి ప్రాజెక్టుపై దృష్టి
ప్రస్తుతం మహేశ్ బాబు .. 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా మరో షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళతాడనే వార్తలు వచ్చాయి.

ముందుగా మహేశ్ బాబుకి సుకుమార్ ఒక లైన్ వినిపిస్తే ఆ జోనర్ తనకి సరిపడదని చెప్పాడట. దాంతో మరో కథపై కూర్చుని కసరత్తు చేసి వస్తే, అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదని అన్నాడట. మహేశ్ బాబును సాధ్యమైనంత త్వరగా ఒప్పించవలసిన అవసరం ఉందని తెలిసిన సుకుమార్, అదే పనిలో వున్నాడని అంటున్నారు. 'మహర్షి' సినిమా షూటింగు పూర్తయ్యేలోగా సుకుమార్ ఒప్పించలేకపోతే, మరో దర్శకుడికి మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. 
Mahesh Babu
sukumar

More Telugu News