కడప ఉక్కు పరిశ్రమకు నేడు చంద్రబాబు శంకుస్థాపన
- విభజన హామీలో ఉన్నా పట్టించుకోని కేంద్రం
- చివరికి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం
- ఉదయం 11:12 గంటలకు శంకుస్థాపన
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పేర్కొన్నా కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్మించాలని సంకల్పించింది. ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’గా నామకరణం చేసిన ఈ కంపెనీ నిర్మాణానికి ఈ ఉదయం 11:12 గంటలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.