నాటి విపత్తు మళ్లీ రాకూడదని సముద్రుడికి నేడు ప్రత్యేక పూజలు!
- ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రకృతి విపత్తు
- భూకంపం తరువాత విరుచుకుపడిన రాకాసి అలలు
- సునామీతో 2.27 లక్షల మంది మృతి
- నేడు సముద్రుడికి ప్రత్యేక పూజలు
ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు, సమీపంలోని భవనాలను నేలమట్టం చేస్తూ, వేల కొద్దీ కిలోమీటర్ల తీర భూమిని ఆక్రమిస్తూ, కనిపించిన వారందరి ప్రాణాలను తీసిందా విపత్తు. ఇండియాలో దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు తమిళనాడుకు అతిపెద్ద నష్టం సంభవించింది. మరోసారి ఇటువంటి ప్రమాదం రాకుండా చూడాలని కోరుతూ నేడు తీర ప్రాంతంలో సముద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రజలు.