మొన్న కేసీఆర్ను తిట్టారు.. ఇప్పుడాయన బూట్లు నాకేందుకు సిద్ధమవుతున్నారు: పిడమర్తి రవి
- మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు
- ఇప్పుడు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు
- ఇటువంటి వారితో జాగ్రత్త
మాయమాటలు చెప్పేవారు మనతో జత కలవాలని చూస్తున్నారని, అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కప్పుకున్న పార్టీ కండువా రంగు మారకముందే పార్టీ ఫిరాయింపులకు సిద్ధమవుతున్నారని రవి ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి బరిలోకి దిగిన పిడమర్తి రవి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో రవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.