కేసీఆర్ నాకు గిఫ్ట్ ఇస్తారట.. తీసుకోవాలా, వద్దా తమ్ముళ్లూ?: చంద్రబాబు
- కేసీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి
- ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు
- మోదీ గుండెల్లో నిద్రపోయి రాష్ట్ర హక్కులను సాధించుకుంటాం
ప్రధాని మోదీ గుండెల్లో నిద్రపోయి రాష్ట్ర హక్కులను సాధించుకుంటామని చంద్రబాబు తెలిపారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా మోదీ విస్మరించారని మండిపడ్డారు. మోదీ కంటే ఐదేళ్ల ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంపై పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని... ప్రశ్నిస్తున్న ఎంపీలపై ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని, ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.