రాఫెల్ డీల్ వ్యవహారంలో మోదీని పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: జైపాల్ రెడ్డి
- రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు రాఫెల్ సమాచారాన్ని దగ్గర పెట్టుకున్నారు
- సీఎం పదవిని కాపాడుకోవడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
- పారికర్ అస్వస్థత కారణంగా గోవాలో పాలన స్తంభించింది
పారికర్ అస్వస్థత కారణంగా గోవా రాష్ట్రంలో పాలన స్తంభించిందని... సీఎం పీఠాన్ని ఆయన జలగలా పట్టుకుని వేలాడుతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జైపాల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాఫెల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని... ఈ అంశాన్ని మళ్లీ వివాదాస్పదం చేసేందుకే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.