ముంచుకొస్తున్న ముప్పు.. పెరిగిన భారత సముద్ర తీర నీటిమట్టం!
- 2.8 అడుగుల మేర పెరిగిన సముద్ర నీటిమట్టం
- నీటిమట్టం పెరిగితే నదులకు తీవ్ర ముప్పు
- భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా మారుతాయి
సముద్ర నీటి మట్టం పెరిగితే నదుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా గంగ, కృష్ణ, కావేరి, మహానది డెల్టా ప్రాంతాలు ముప్పును ఎదుర్కొంటాయి. దీని వల్ల దక్షిణ భారతంలో 2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర నీటిమట్టం పెరిగితే భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా మారి, వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి మహేష్ శర్మ తెలిపారు. తీర ప్రాంత పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.