బీజేపీకి షాక్.. పశ్చిమ బెంగాల్లో రథయాత్రకు హైకోర్టు బ్రేక్!
- సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన ధర్మాసనం
- రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన పట్టించుకోలేదని వ్యాఖ్య
- నిఘావర్గాల సమాచారం చూడాల్సిందని సూచన
యాత్రకు మమతాబెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ కోర్టును ఆశ్రయించింది. గురువారం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అనుకూలంగా రావడంతో ఉత్సాహంగా వున్న బీజేపీ శ్రేణులు శనివారం భీర్భూమ్ జిల్లాలో తొలివిడత రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. వారి ఆనందంపై కోర్టు నీళ్లు చల్లింది. కాగా, ఈ వివాదంపై ఇప్పట్లో కోర్టు నిర్ణయం వచ్చేలా కనిపించడం లేదు. కలకత్తా హైకోర్టుకు శీతాకాలం సెలవులు ప్రారంభమయ్యాయి. అందువల్ల వివాదం వెకేషన్ బెంచికి వెళితే తప్ప జనవరి మొదటి వారంలోగా నిర్ణయం వెలువడే అవకాశం లేదు.