పుట్టినరోజు నాడు వెల్లువెత్తిన అభిమానం.. జగన్ చేత కుమార్తెకు అన్నప్రాసన చేయించిన అభిమాని!
- శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘటన
- ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న జగన్
- చిన్నారిని ఆశీర్వదించిన వైసీపీ అధినేత
దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభమైన వేళ ఓ మహిళా అభిమాని తమ కుమార్తెకు జగన్ చేత అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా చిన్నారి పాప ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని జగన్ ఆశీర్వదించారు. అలాగే మరో ఇద్దరు వైసీపీ అభిమానులు జగన్ చేత తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. జగన్ పాదయాత్ర దండుగోపాలపురం నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకూ సాగనుంది.
