జగన్ పై హత్యాయత్నం కేసు.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు కీలక ఆదేశాలు!
- కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలా? వద్దా?
- జనవరి 4లోగా అభిప్రాయాన్ని చెప్పండి
- కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ఈ విషయాన్ని 2019, జనవరి 4వ తేదీలోగా తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో ఈ ఏడాది అక్టోబర్ 25న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జగన్ హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు.