'మిస్టర్ మజ్ను'కు కలిసొచ్చినట్టే

  • అఖిల్ నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • జనవరి 25వ తేదీన విడుదల
  • 'మణికర్ణిక' ప్రభావం అంతగా ఉండదనే ఆలోచన   
అఖిల్ కి ఇంతవరకూ హిట్ పడలేదు. దాంతో 'మిస్టర్ మజ్ను' సినిమాతో అతని ఖాతాలో తప్పకుండా హిట్ చేరాలనే పట్టుదలతో నాగార్జున వున్నారు. అఖిల్ కెరియర్ కి ఈ సినిమా చాలా ముఖ్యం కనుక, సోలోగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. అందువల్లనే సంక్రాంతికి కాకుండా జనవరి 25వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. కానీ అనుకోకుండా 'మహానాయకుడు' జనవరి 24వ తేదీకి వచ్చి చేరింది.

దాంతో అందరి దృష్టి ఆ సినిమా వైపు వెళ్లిపోతుందని ఈ సినిమా టీమ్ టెన్షన్ పడింది. అయితే కొన్ని కారణాల వలన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. దాంతో 'మిస్టర్ మజ్ను' టీమ్ తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక జనవరి 25వ తేదీనే 'మణికర్ణిక' వస్తున్నా, ఆ సినిమా ప్రభావం 'మిస్టర్ మజ్ను'పై అంతగా ఉండదని భావిస్తున్నారు. 'మహానాయకుడు' రిలీజ్ వాయిదా పడటం వలన థియేటర్ల పరంగా .. వసూళ్ల పరంగా 'మిస్టర్ మజ్ను'కి కలిసొచ్చినట్టేనని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
akhil
nidhi agarwal

More Telugu News