అంబానీ సోదరుల ఒప్పందాన్ని తిరస్కరించిన డాట్... దివాలా దిశగా అనిల్ అంబానీ!
- ఇప్పటికే అప్పుల పాలైన అనిల్ అంబానీ
- సోదరుడికి ఆస్తులమ్మాలని నిర్ణయం
- ఈ డీల్ నిబంధనలకు విరుద్ధమన్న డాట్
ఈ ఒప్పందం భారత స్పెక్ట్రమ్ కొనుగోలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నది డాట్ అభిప్రాయం. వాస్తవానికి రుణ తగ్గింపు చర్యల్లో భాగంగా ఏడాది క్రితమే రిలయన్స్ జియోతో రూ. 25 వేల కోట్ల ఒప్పందాన్ని అనిల్ అంబానీ కుదుర్చుకున్నారు. తమ వద్ద ఉన్న రేడియో తరంగాలతో పాటు పలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తులను విక్రయించాలన్నది అనిల్ ఉద్దేశం. దీని ద్వారా తన సంస్థలు దివాలా ప్రక్రియకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన భావించారు. ఇప్పుడది డాట్ నిర్ణయంతో మరింత కష్టంగా మారింది.