విశాల్ కు వ్యతిరేకంగా 50 మంది నిర్మాతల నిరసన!

  • తమిళనాడులో శుక్రవారం విడుదల కానున్న 9 సినిమాలు
  • చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన
  • కార్యాలయానికి తాళం వేసి.. పోలీస్ స్టేషన్ లో అప్పగింత
తమిళనాడు నిర్మాతల మండలిలోని అంతర్గత విభేదాలు ఈరోజు రచ్చకెక్కాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్న విశాల్ కు వ్యతిరేకంగా మరొక వర్గం ఆందోళన నిర్వహించింది. నిర్మాతల సంఘం భవనానికి తాళం వేసి, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించింది.

రానున్న శుక్రవారం తమిళనాడులో ఏకంగా 9 సినిమాలు విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదలైతే... చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని విశాల్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. నిర్మాతల సంఘం కార్యాలయం ఎదుట దాదాపు 50 మంది నిర్మాతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో విశాల్ అక్కడ లేకపోవడంతో... కౌన్సిల్ సెక్రటరీ కదిరేశన్ తో వాగ్వాదానికి దిగారు. విశాల్ కు సన్నిహితులైన ఉదయ, ఆర్కే సురేష్ లు కూడా ఇప్పుడు వ్యతిరేక వర్గంలో చేరడం కొసమెరుపు.
Go Back to Shorts
vishal
kollywood
producers councel
protest

More Telugu News