టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్ అలీ డిమాండ్
- పార్టీ ఫిరాయించిన దామోదర్ పై చర్యలు తీసుకోవాలి
- సాక్ష్యాధారాలను స్వామిగౌడ్ కు అందజేస్తాం
- కేసీఆర్ క్రెడిబిలిటీ ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని షబ్బీర్ అన్నారు. నిరుద్యోగ భృతిపై కేసీఆర్ అప్పుడే మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏమిటో, కేసీఆర్ క్రెడిబిలిటీ ఏమిటో జనాలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇంట్లో కూర్చోబోమని... ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.