వేలంపాటలో కపిల్ దేవ్ ఉంటే.. రూ. 25 కోట్లకు తగ్గకుండా పలికేవాడు: గవాస్కర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేలంపాటలో కపిల్ దేవ్ ఉంటే.. రూ. 25 కోట్లకు తగ్గకుండా పలికేవాడు: గవాస్కర్

  • జింబాబ్వేపై కపిల్ ఆడిన ఇన్నింగ్స్ ను మళ్లీ నేను ఇంతవరకు చూడలేదు
  • కపిల్ ఒక గొప్ప ఆటగాడు
  • కపిల్ కు ఉన్న విలువ చాలా ఎక్కువ
టీమిండియా క్రికెట్ దిగ్గజం, తన స్నేహితుడు కపిల్ దేవ్ పై లెజెండరీ క్రికెటర్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. కపిల్ గొప్ప ఆటగాడని ఆయన కితాబిచ్చారు. ఆజ్ తక్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి ఈ ఇద్దరు దిగ్గజాలు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ, జింబాబ్వేపై కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 పరుగులు)ను తాను ఇంత వరకు మళ్లీ చూడలేదని చెప్పారు. ఆ మ్యాచ్ లో తాము 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయామని... ఆ పరిస్థితుల్లో 70 నుంచి 80 పరుగులు మాత్రమే చేయగలమని భావించామని అన్నారు. అప్పుడు విపరీతమైన చలి ఉందని... బంతి కూడా బాగా తిరుగుతోందని చెప్పారు. కానీ కపిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ ను గెలిపించాడని చెప్పారు. సిక్సర్లతో చెలరేగి దూకుడుగా ఆడాడని తెలిపారు.

తాజా ఐపీఎల్ వేలంపాటలో కపిల్ ఉంటే... రూ. 25 కోట్లకు తగ్గకుండా పలికేవాడని గవాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా కపిల్ కల్పించుకుని... ఇంత వరకు తాను అంత డబ్బును ఊహించలేదని నవ్వుతూ చెప్పారు. దీనికి సమాధానంగా... కపిల్ కు ఉన్న విలువ అంత ఎక్కువని గవాస్కర్ అన్నారు. 
kapil dev
gavaskar
cricket

More Telugu News