బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయి: కవిత
- పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నాయి
- ఇంత వరకు ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదు
- పార్లమెంటులో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది
సభ సజావుగా సాగకుండా బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడుతున్న నేపథ్యంలో, కవిత ఈ మేరకు ట్వీట్ చేశారు. రాఫెల్ డీల్ అంశం నేపథ్యంలో, ఉభయసభల్లో గందరగోళం నెలకొంటున్న సంగతి తెలిసందే. ఈ గోల మధ్య ఉభయసభలు వాయిదా పడుతున్నాయి.