New Delhi: వారి ఓటమిలో చంద్రబాబు తప్పేమీ లేదు: నిజామాబాద్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు!

  • కూటమి ఓటమికి కారణం చంద్రబాబుక కాదు
  • తెలంగాణ ప్రజలు మొదటి నుంచి టీఆర్ఎస్ వెంటే
  • కాంగ్రెస్ నేతలు చంద్రబాబు వల్లే ఓడామనడం విడ్డూరం
  • న్యూఢిల్లీలో మీడియాతో కవిత
తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, దీనికి చంద్రబాబే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. నిన్నటివరకూ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, నేడు చంద్రబాబు ప్రచారం వల్లే ఓడిపోయామని అంటున్నారని, కూటమి ఓటమి పట్ల ఆయన తప్పేమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు మొదటి నుంచి టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ఈ విషయం తమకు తెలుసునని, చంద్రబాబు వచ్చినా, మరెవరు వచ్చినా ప్రజల మనసుల నుంచి కేసీఆర్ ను తొలగించలేకపోయారని ఆమె అన్నారు.

నేడు న్యూఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేకున్నారని, కుంటిసాకులు చెబుతూ తమను తామే మభ్యపుచ్చుకుంటున్నారని అన్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న కారణంగానే టీఆర్ఎస్ కు మరోసారి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.
New Delhi
Chandrababu
K Kavitha
Congress
Telangana
TRS
KCR

More Telugu News