Andhra Pradesh: మళ్లీ టీటీడీ సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య!

  • టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియామకం
  • గతంలో ఈ పదవికి రాజీనామా చేసిన సండ్ర
  • తెలంగాణ ఎన్నికలు ముగిశాక మళ్లీ స్వీకరణ
తెలంగాణలోని సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక పదవిని అప్పగించారు. సండ్రను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యుడిగా మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వెంకటవీరయ్య ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. గతంలో టీటీడీ సభ్యుడిగా ఉన్న సండ్ర.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించారు.

ఎన్నికలు ముగిసిన అనంతరం చంద్రబాబు ఆయనకు మళ్లీ పాత బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తిరుమలలో జరిగిన ముక్కోటి ఉత్సవాల్లో సండ్ర తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా సండ్ర మీడియాకు తెలిపారు.
Andhra Pradesh
Telangana
sattupally
sandra
venkata veeraiah
TTD
Telugudesam
Chandrababu

More Telugu News