నగదు రహిత టికెట్ విధానం వైపు ఏపీ ఎస్ఆర్టీసీ అడుగులు: సంస్థ ఎండీ సురేంద్రబాబు
- త్వరలో స్వైపింగ్ కార్డులు అందుబాటులోకి
- అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు
- 96 శాతం బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్ అమలు
ఆర్టీసీలో ప్రయాణించేటప్పుడు టికెట్ కోసం నగదు ఇవ్వకుండా కార్డు స్వైప్ చేస్తే టికెట్ జనరేట్ అయిపోతుందన్నారు. టికెట్కు చెల్లించాల్సిన మొత్తం కార్డు నుంచి కట్ అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో 96 శాతం వాహనాలకు ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం అమలవుతోందని, త్వరలో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నామని తెలిపారు.