adivi srinivas: భారీ బడ్జెట్ తో 'గూఢచారి'కి సీక్వెల్

  • 'గూఢచారి 2' స్క్రిప్ట్ పై కసరత్తు 
  • 2019 మధ్యలో సెట్స్ పైకి 
  • 2020లో సినిమా విడుదల    
అడివి శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన 'గూఢచారి' భారీ వసూళ్లను సాధించింది. నటుడిగా ఆయనని ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. 'గూఢచారి'కి సీక్వెల్ గా ఆయన 'గూఢచారి 2' చేసేందుకు రంగంలోకి దిగాడు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పై ఆయన కసరత్తు కొనసాగుతోంది.

'గూఢచారి' కంటే భారీగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వివిధ దేశాల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెబుతున్నారు. 2019 ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగును ప్రారంభించి, 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా చెబుతున్నారు. 'క్షణం' .. 'గూఢచారి' తీసుకొచ్చిన క్రేజ్ తో, అదే జోనర్ సినిమాలు చేయాలని అడివి శేష్ నిర్ణయించుకున్నాడన్న మాట. 'గూఢచారి 2'తో ఆయన స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
adivi srinivas

More Telugu News