KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించిన కేటీఆర్.. హాజరైన హరీష్ రావు

  • బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ
  • వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ
  • తెలంగాణ భవన్ వద్ద కోలాహలం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాయి. తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేటీఆర్ నమస్కరించారు.

అనంతరం కార్యాలయంలో తన కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్ లోకి ప్రవేశించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహముద్ అలీ, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు హాజరవడంతో... తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొంది.
KTR
TRS
woking president
telangana bhavan

More Telugu News