ap: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ సచివాలయం ఉద్యోగుల మృతి.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలింపు

  • కోదాడ మండలం దొరకుంట వద్ద ప్రమాదం
  • హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తుండగా ప్రమాదం
  • ఏపీ సచివాలయంలో నెలకొన్న విషాదం
ఇద్దరు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందరినీ కలచివేస్తోంది. కోదాడ మండలం దొరకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ వద్ద పీఎస్ గా పని చేస్తున్న భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ విజయలక్ష్మిని ఖమ్మం ఆసుపత్రికి, మరో వ్యక్తి పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో ఏపీ సచివాలయంలో విషాదం నెలకొంది.
ap
secretariat
employees
accident

More Telugu News