తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
- కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేట్
- ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి
- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం
అంతేకాదు, మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు, నారాయణపేట్ లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశం బాగుంటాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెంటనే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.