ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ.. తల్లిదండ్రులు మందలించడంతో రైలు కిందపడి అక్క ఆత్మహత్య
- కుమార్తెలను మందలించిన తండ్రి
- మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లి పోయిన పెద్దకుమార్తె
- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
పరీక్షలు దగ్గరపడుతుండడంతో చదువుపై దృష్టిపెట్టాలంటూ మండిపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన సుచిత రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఫ్లైఓవర్ సమీపంలో రైలు పట్టాల పక్కన సుచిత మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.