చరిత్ర సృష్టించిన పీవీ సింధు!

  • వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ లో విజయం 
  • ఒకుహరాతో తలపడిన సింధు
  • 21-19, 21-17 తేడాతో గెలుపు
ఈ సంవత్సరంలో అంతర్జాతీయ టైటిల్‌ ను గెలిచి సీజన్‌ ను సగర్వంగా ముగించాలని ఉందని చెప్పిన తెలుగుతేజం పీవీ సింధూ, మాట తప్పలేదు. కొద్దిసేపటి క్రితం చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌ లో జపాన్ కు చెందిన నోజోమి ఒకుహరాతో తలపడిన సింధు రెండు వరుససెట్లలో మ్యాచ్ ని గెలిచింది.

తొలి సెట్ ను 21-19 తేడాతో గెలిచిన ఆనందంలో రెండో సెట్ ను ప్రారంభించిన సింధూ, ఒకదశలో ఒకుహరాతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండో సెట్ ను 21-17 తేడాతో గెలుచుకుని టైటిల్ ను నెగ్గింది. ఈ విజయంతో సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధూ రికార్డు నెలకొల్పింది.
Go Back to Shorts
pv sindhu
World tour Finals

More Telugu News