283 పరుగులకే ఆలౌట్... ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లీడ్!

  • కోహ్లీ, రహానే మినహా రాణించని ఆటగాళ్లు
  • ఇద్దరు ఆటగాళ్లు డక్కౌట్
  • లియాన్ కు 5 వికెట్లు
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను 283 పరుగుల వద్ద ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు సాధించిన ఆసీస్ కు 43 పరుగుల ఆధిక్యం లభించగా, మరికాసేపట్లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

భారత బ్యాట్స్ మన్లలో విరాట్ కోహ్లీ, రహానే మినహా మరెవరూ రాణించలేదు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 2, మురళీ విజయ్ 0 పరుగులు మాత్రమే చేయగా, పుజారా 24, కోహ్లీ 123, రహానే 51, హనుమ విహారి 20, రిషబ్ పంత్ 36, షమీ 0, ఇషాంత్ శర్మ 1, ఉమేష్ యాదవ్ 4, బుమ్రా 4 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 5 వికెట్లతో రాణించగా, స్టార్క్, హాజల్ వుడ్ కు చెరో రెండు, కుమిన్స్ కు ఒక వికెట్ లభించాయి.
Go Back to Shorts
Australia
India
Cricket
Virat Kohli

More Telugu News