‘ఎన్టీఆర్’ నుంచి అప్‌డేట్ ఇస్తూ పోస్టర్ విడుదల
- సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్’
- రేపు ట్రైలర్ విడుదల
- ఈ నెల 21న ఆడియో వేడుక
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదలకానుంది. ఇక ఆడియో వేడుక ఈ నెల 21న నిమ్మకూరులో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘ఎన్టీఆర్’లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.