జేబులో పేలిన మొబైల్ ఫోన్.. మంటలు అంటుకుని వృద్ధుడి సజీవదహనం!
- రాజస్తాన్ లోని నెతావల్ గఢ్ లో ఘటన
- చవక ఫోన్లను అందించిన ప్రభుత్వం
- కేసు నమోదు చేసిన పోలీసులు
రాజస్తాన్ లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్తాన్ ప్రభుత్వం రూ.1100 కు అందజేసిన ఫోన్ ను కొన్నాడు. కాగా, ఈ ఫోన్ ను బనియన్ జేబులో పెట్టుకుని వెళుతుండగా నిన్న రాత్రి ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆయన మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.