Andhra Pradesh: 2019లో కేసీఆర్ పట్టిందల్లా బంగారమే.. ప్రయత్నిస్తే ప్రధాని కూడా కావొచ్చు!: జోతిష్యుడు రమణారావు

  • మోదీకి నెగటివ్ వైబ్రేషన్స్ ప్రభావం
  • పూజలు చేస్తే కేసీఆర్ కు ప్రధాని యోగం
  • 2019లో రాహుల్ ఆశలు గల్లంతే
ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంతో పాటు పార్లమెంటులోనూ నెగటివ్ వైబ్రేషన్స్ కొనసాగుతున్నాయని ప్రముఖ హస్త సాముద్రిక నిపుణులు, జ్యోతిష్యుడు మాండ్రు రమణారావు తెలిపారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం అద్భుతంగా ఉందనీ, 2019లో ఆయన పట్టిందల్లా బంగారంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోందని కితాబిచ్చారు. అమరావతిలోని ఏపీ సచివాలయానికి వచ్చిన రమణారావు మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ జాతకం చాలా బలంగా ఉందనీ, కొన్ని పూజలు చేస్తే ఆయన ప్రధాని అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఒకవేళ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేస్తే మోదీనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని యోగం ఉన్నప్పటికీ, 2019లో మాత్రం అది జరగదని తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
Chandrababu
Congress
Telugudesam
KCR
Prime Minister
Narendra Modi

More Telugu News