Telangana: ప్రభుత్వం ఏర్పాటుకు కేసీఆర్ కు ఆహ్వానం!

  • టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ఏకగ్రీవం
  • గవర్నర్ ని కలిసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు
  • ఈ తీర్మాన ప్రతి నరసింహన్ కు అందజేత
టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అనంతరం, రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కలిశారు. ఏకగ్రీవ తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కేసీఆర్ రాజీనామాను ఆయన కార్యదర్శి రాజ్ భవన్ కు అందజేశారు. సీఎం కేసీఆర్ తో పాటు 17 మంది మంత్రుల రాజీనామాలను నరసింహన్ ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఉత్తర్వులు జారీ చేశారు. 
Telangana
rajbhavan
TRS
kcr

More Telugu News