Deepak: కుటుంబ కలహాలతో విసిగిపోయి.. పిల్లల్ని కిందకు తోసేసి.. తనూ దూకేసిన భర్త!

  • దీపక్‌కు ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల
  • భార్యతో గొడవపడిన దీపక్
  • చిన్నారులకు తప్పిన ప్రమాదం
కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని మంటల్లో తోసేసి తను కూడా దూకిన విషాద ఘటన హర్యానాలోని అంబాలలో జరిగింది. దీపక్ కుమార్ అనే వ్యక్తికి ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాప ఉన్నారు. సోమవారం ఇంట్లో భార్యతో అతనికి గొడవ జరిగింది. దీంతో కుంగిపోయిన దీపక్.. ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

నిన్న తన ఇద్దరు పిల్లల్ని ఇంటిపైకి తీసుకెళ్లి కింద ఉన్న మంటల్లోకి తోసేసి.. అనంతరం తాను కూడా దూకాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్ ఆసుపత్రికి తరలించారు. దీపక్ పరిస్థితి విషమంగా ఉందని.. చిన్నారులకు ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Deepak
Haryana
Ambala
suicide Attempt
Chandigarh

More Telugu News