Madhurai: డెలివరీ ఇచ్చే ఫుడ్‌ని ఎంగిలి చేసిన బాయ్.. చెక్ పెట్టిన 'జొమాటో'!

  • ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్‌లు అంటించనుంది
  • తెరిస్తే మళ్లీ అంటించడానికి వీలు పడదు
  • డెలివరీ బాయ్స్‌కి ప్రత్యేక శిక్షణ
ఈ మధ్య బాగా వైరల్ అయిన వాటిలో మధురైకు చెందిన ఓ డెలివరీ బాయ్‌ కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే ఆహారాన్ని ఎంగిలి చేసిన వీడియో ఒకటి. ఈ వీడియోను చూసిన ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఆహారాన్ని ప్యాక్‌ చేసే ప్యాకెట్లు, డబ్బాలకు ఈ ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్‌లు అంటించనున్నారట. వీటిని ఒకవేళ డెలివరీ బాయ్ తెరిచేందుకు ప్రయత్నించినా మళ్లీ అంటించడానికి వీలు పడదట. దీంతో డెలివరీ బాయ్స్ వాటిని తెరిచేందుకు ప్రయత్నించరని జొమాటో వెల్లడించింది. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని జొమాటో వెల్లడించింది. అలాగే డెలివరీ బాయ్స్‌కి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు జొమాటో వెల్లడించింది.
Madhurai
Zomato
Tamper Proofs
Delivery boys

More Telugu News