ఫలించని సీపీఎం యత్నం... తెలంగాణ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ ప్రభావం అంతంతే!
- చిన్నాచితకా 28 పార్టీలు ఏకమైనా ప్రయోజనం సున్నా
- సామాజిక న్యాయం, బీసీ ముఖ్యమంత్రి నినాదాలను విశ్వసించని ఓటర్లు
- భద్రాచలం, మధిరలో మాత్రమే మూడో స్థానంతో సరి
భద్రాచలం, మధిర స్థానాల్లో మాత్రమే కనీసం మూడో స్థానంలో నిలిచి పరువు దక్కించుకున్నారు. పైగా 2014 ఎన్నికల్లో సీపీఎం 1.5 శాతం ఓట్లు సాధించగా ఈసారి ఎన్నికల్లో ఓట్ల శాతం 0.4కి పడిపోయింది. అట్టహాసం చేసిన బీఎల్పీ అభ్యర్థులు కేవలం 0.7 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా ప్రభావం చూపుతారని భావించిన మిర్యాలగూడ, నారాయణపేట్, ఆలేరు, చెన్నూరు, కొత్తగూడెం, మహబూబాబాద్ స్థానాల్లో సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలోనైనా ఓట్లను సాధించలేకపోయారు.