తెలంగాణలో చంద్రబాబు అడుగుపెట్టగానే.. కొంచెం భయపడ్డా: పోసాని
- తిమ్మిని బమ్మిని చేసేంత సామర్థ్యం చంద్రబాబుకు ఉంది
- కానీ, ప్రజలు కేసీఆర్ నే నమ్మారు
- కేసీఆర్ చేసిన మంచి పనులు ఆయనను అభిమానించేలా చేశాయి
కేసీఆర్ కూడా ఓడిపోతారని రెండో సైంధవుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారని ఎద్దేవా చేశారు. ఒక బక్కవాడ్ని కొట్టడానికి ఇంత మంది వచ్చారని అన్నారు. తాను ఎంతో ప్రేమించే గద్దర్ కూడా కూటమిలోకి రావడంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తన జీవితంలో కేసీఆర్ ను దగ్గర నుంచి చూసింది కూడా లేదని... కానీ, ఆయన చేసిన మంచి పనులు ఆయనను అభిమానించేలా చేశాయని తెలిపారు.