సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సూర్యతో డ్యాన్స్ చేస్తున్న రకుల్
- 'చిత్రలహరి' షూటింగులో సాయిధరం తేజ్
- '96' అక్కడ '99'గా మారింది!
* గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో వున్న సాయిధరం తేజ్ తాజాగా 'చిత్రలహరి' చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే, అక్కడ దాని టైటిల్ని '99'గా మార్చారు.