Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మల్లికార్జున్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు: గోపికా పూర్ణిమ

  • మల్లికార్జున్ కిందిస్థాయి నుంచి వచ్చాడు 
  • బస్సు కూడా ఎక్కకుండా నడిచి వెళ్లేవాడు  
  • పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నాం
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మల్లికార్జున్ .. గోపికా పూర్ణిమ దంపతులు పాల్గొని, తమకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మల్లికార్జున్ గురించి గోపికా పూర్ణిమ మాట్లాడుతూ .."మల్లికార్జున్ ని చూసి నేను గర్వపడుతుంటాను. ఎందుకంటే ఆయన చాలా కిందిస్థాయి నుంచి ఎదుగుతూ వచ్చాడు. ఒక చాప .. రెండు జతల బట్టలు గల సూట్ కేస్ తో ఆయన చెన్నై కి వచ్చాడు. ఇప్పటికీ వాటిని మా ఇంట్లో జాగ్రత్తగా ఉంచాను.

బస్సు ఎక్కితే డబ్బులు సరిపోవనే ఉద్దేశంతో ఆయన ఏదో ఒక పాటను హమ్ చేస్తూ నడిచే వెళ్లేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎదుగుతూ రావడం నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే ఆయనని చూసి నేను గర్వపడుతుంటాను. ఇక మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే చేసుకునే వాళ్లం కాదు. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం .. అలా వాళ్ల అంగీకారంతోనే చేసుకున్నాం" అని చెప్పుకొచ్చింది.   
mallikarjun
gopika

More Telugu News