తెలంగాణలో మేము పడ్డ కష్టానికి సరైన ఫలితం రాలేదు: జీవీఎల్
- మా ఐదు స్థానాలను నిలుపుకోలేకపోయాం
- టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు రావడానికి కారణం బాబే
- బాబు చేసిన ఆర్భాటం వల్లే ఇదంతా జరిగింది
టీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి కారణం చంద్రబాబేనని, ఆయన చేసిన ఆర్భాటం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ఏపీలో నాలుగైదు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆధిక్యత లభించకపోయినన్పటికీ, లోక్ సభ ఎన్నికల్లో తమకు ఈ స్థితి పునరావృతం కాదని అన్నారు.
గెలుపునైనా, ఓటమినైనా స్వీకరించి, దానిపై విశ్లేషణ చేసుకునే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని, వీటి ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ఉండదని అభిప్రాయపడ్డారు.