సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 21న వస్తున్న సాయిపల్లవి సినిమా
  • నాని స్థానంలో దుల్కర్ సల్మాన్ 
  • తెలుగులోకి మరో హిందీ హిట్ 
  • విలన్ గా 'అర్జున్ రెడ్డి' కమెడియన్
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడిపడి లేచె మనసు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 21న దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మల్టీ స్టారర్ ను నిర్మించనున్నారు. ఇందులో నాని, శర్వానంద్ హీరోలుగా నటిస్తారని నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, శర్వా స్థానంలో దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నట్టు తాజా సమాచారం.
*  గత ఏడాది ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించిన హిందీ హిట్ చిత్రం 'బరేలీకి బర్ఫీ' తెలుగులోకి రీమేక్ అవుతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ దీనిని తెలుగులో నిర్మిస్తున్నారు.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గా నటించాడు. ఈ క్రమంలో తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం 'నిను వీడని నీడను నేనే' చిత్రంలో రాహుల్ రామకృష్ణ విలన్ గా నటించాడట.
Go Back to Shorts
Sai Pallavi
Sharwanand
Nani
Dulkar

More Telugu News