ఆవు దూడలకు రాజకీయ పార్టీల పేర్లు.. ఓ రైతు ముచ్చట!
- అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పేర్లు పెట్టి ఆసక్తికి తెరలేపిన అన్నదాత
- వారెప్పటికీ కలవరు...కనీసం ఈ దూడ రూపంలోనైనా కలిసుంటారు
- తెవిగా సమాధానం ఇచ్చిన రైతు
ఆశ్చర్యపోయిన స్థానికులు కొందరు ‘అన్నదమ్ములైన కవలలకు నిత్యం జగడానికి దిగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పేర్లు ఎందుకు పెట్టావ్’ అని ప్రశ్నిస్తే సమాధానం కూడా ఆసక్తి కలిగినదే ఇచ్చాడు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పక్షాలు ఎప్పటికీ కలవవు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు ఏ స్థాయిలో దూషించుకున్నదీ చూశాం. కనీసం దూడలకైనా వాటి పేర్లు పెడితే కలిసి ఉన్నాయన్న ఆనందం మిగులుతుంది’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు.
పల్లె రైతుల్లో రాజకీయాలపై పెద్దగా అవగాహన ఉండదు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అటువంటి వారు ధన్సింగ్ సమాధానం విని నోరువెళ్లబెడుతున్నారు.