ప్రపంచ రికార్డు సృష్టించిన ‘అవెంజర్స్ 4’ ట్రైలర్
- 24 గంటల్లోనే 289 మిలియన్ వ్యూస్
- అవెంజర్స్ సిరీస్‌లో ఇదే చివరి సినిమా
- వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల
‘అవెంజర్స్ 4’ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సూపర్ హీరోస్ రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ట్రైలర్ రాగానే ఒక్కసారిగా దానిపై పడ్డారు. 24 గంటలు కూడా గడవకముందే ఏకంగా 2.89 కోట్లమంది చూసేశారు. యాక్షన్ సన్నివేశాలతో అత్యద్భుతంగా ఉన్న ట్రైలర్ సూపర్ హీరోస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది.